ASF: రాష్ట్ర అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్‌ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని అన్ని జిల్లాల్లో శాంతిభద్రతలకు సంబంధించిన పలు అంశాలను డీజీపీ దృష్టికి వారు తీసుకెళ్లినట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తానని MLC పేర్కొన్నారు.
తెలంగాణ
రాష్ట్ర అడిషనల్ డీజీపీని కలిసిన MLC విఠల్


