హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మాణ పనులు ప్రారంభించిన ఛైర్ పర్సన్

NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారిపై చేపట్టనున్న రోడ్డు డివైడర్ నిర్మాణ పనులను స్థానిక ఛైర్ పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.