PLD: మాచర్ల ఆర్టీసీ బస్టాండ్‌లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులకు అందుతున్న మౌలిక వసతులను స్వయంగా పరిశీలించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, సంక్షేమ పథకాల పనితీరుపై మహిళలతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బస్టాండ్‌లో ఎమ్మెల్యే జూలకంటి ఆకస్మిక తనిఖీ


