హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వలసపాకలలో రోడ్డు ప్రమాదం

KKD: కరప మండలం వలసపాకలలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. వలసపాకల దుర్గాదేవి గుడి వద్ద కాకినాడ వైపు వెళ్తున్న రెండు బైకులను ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకులపై ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. కరప పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు