హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ, ఇంకుడు గుంతల కోసం మార్కింగ్

SRD: కంగ్టి మండలం సర్దార్ తండా గ్రామపంచాయతీలో డ్రైనేజీ ఎండ్ పాయింట్, ఇంకుడు గుంతల నిర్మాణానికి గురువారం స్థలాల మార్కింగ్ చేపట్టారు. సర్పంచ్ స్వరూప్ చంద్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంతోష్‌ స్థలాలను పరిశీలించి మార్కింగ్‌ చేశారు. ఈ పనులతో పరిసరాల పరిశుభ్రతతో పాటు నీటి సంరక్షణకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.