హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆపరేషన్ థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు

KRNL: కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కే. వెంకటేశ్వర్లు ఆపరేషన్ థియేటర్లను ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉన్నారా, రోగులకు సేవలు సక్రమంగా అందుతున్నాయా అని పరిశీలించారు. అత్యవసర సేవలు, ఆపరేషన్లు నిరంతరాయంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.