హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

"ఒలింపిక్స్ లక్ష్యంగా సాధన చేయాలి"

KKD: క్రీడాకారులు జాతీయ స్థాయికే పరిమితం కాకుండా ఒలింపిక్స్ లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పిలుపునిచ్చారు. అమరావతి ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను గురువారం కాకినాడ DSA ఆఫీసులో ఆయన సత్కరించారు. ఒలింపియన్ కె.రజినితో కలిసి ట్రాక్ సూట్లు, స్పోర్ట్స్ షూస్ అందజేసి ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు.