కృష్ణా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 14, 15 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో కలెక్టర్ డీకే బాలాజి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. లా అండ్ ఆర్డర్, పోలీస్ బందోబస్తు, ప్రోటోకాల్, విద్యుత్, రవాణా, వైద్య, ఫైర్ సేఫ్టీ, ఆహార భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర అంశాలపై సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు


