హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వృద్ధుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: కలెక్టర్

PLD: వృద్ధుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ కృతిక శుక్ల తెలిపారు. జిల్లాలో 1,27,686 మంది వృద్ధులకు నెలకు రూ.52.78 కోట్లతో రూ.4,000 చొప్పున పెన్షన్ అందిస్తున్నట్లు చెప్పారు. వృద్ధుల సమస్యల పరిష్కారంతో పాటు ఫిజియోథెరపీ, జెరియాట్రిక్ కేర్ సేవలను విస్తరిస్తున్నామన్నారు. అనంతరం వృద్ధులను సన్మానించి సహాయక పరికరాలు అందజేశారు.