హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాడి జరిగి 10 రోజులు.. చర్యలు శూన్యం!

HYD: కంటోన్మెంట్‌ బోర్డులో స్వీపర్లుగా పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన రోజే బాధితులు మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, 10 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.