హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేపై అసత్య ప్రచారంపై ఫిర్యాదులు

MDK: ఎమ్మెల్యే డాక్టర్‌ మైనంపల్లి రోహిత్‌రావుపై SMలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు నియోజకవర్గవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న ఎమ్మెల్యే ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. బాధ్యులపై ఐటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.