హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల విజయమే జగనన్నకు బహుమతి'

ASR: స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయమే జగనన్నకు ఇచ్చే బహుమతి అని ఎమ్మెల్యే మత్స్యలింగం అన్నారు. గురువారం అనంతగిరి మండలంలోని పెదకోట, కివర్ల, పినకోట, జీనబాడు పంచాయతీల్లో ఐడీ కార్డుల పంపిణీ, బూత్ కమిటీల బలోపేతంపై సమావేశాలు నిర్వహించారు. పార్టీ జెండాలు ఆవిష్కరించి కార్యకర్తలకు ఐడీ కార్డులు అందించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు.