హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిందం దీప్తికి ఆర్ధిక సాయం చేసిన పద్మశాలీలు

ASF: కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన కుమారి సిందం దీప్తికి పట్టణ పద్మశాలి కులస్థులు అండగా నిలిచారు. సమిష్టిగా సేకరించిన రూ.1,61,032 ఆర్థిక సహాయాన్ని దీప్తి కుటుంబానికి గురువారం అందజేశారు. సేకరించిన మొత్తాన్ని దీప్తి ఖాతాలో జమ చేసి చెక్కును అందించారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం సామాజిక బాధ్యత అన్నారు.