హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంగన్వాడీ, పాఠశాలల్లో పీఓ ఆకస్మిక తనిఖీలు

MLG: ఏటూరునాగారం మండలంలో విద్య, వైద్యసేవల నాణ్యతను పరిశీలించేందుకు ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆకులవారి ఘనపూర్ అంగన్వాడీ, జీపీ పాఠశాల, ఎటూరునాగారం సబ్ సెంటర్‌ 1, 2లను పరిశీలించారు. చిన్నారుల హాజరు, పోషకాహారం, విద్యార్థుల అభ్యసన, మందుల నిల్వలు, రికార్డులను తనిఖీచేసి నాణ్యమైన సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు.