MLG: SIR-2026పై కాంగ్రెస్, రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు ప్రజల్లో అపోహలు, అనుమానాలు కలిగించేలా ఉన్నాయని బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. గురువారం రాయల్ ప్లాజాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ SIR ఓటర్లను తొలగించే కార్యక్రమం కాదని, పారదర్శక ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యమన్నారు. అభ్యంతరాలుంటే ఈసీని ఆశ్రయించాలని సూచించారు.
తెలంగాణ
SIRపై కాంగ్రెస్ దుష్ప్రచారం సరికాదు: బీజేపీ అధ్యక్షుడు


