హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీబీ రహిత భారత్‌ లక్ష్యంగా కృషి: కలెక్టర్‌

కర్నూలు జిల్లాలో 2030 నాటికి టీబీ రహిత భారతదేశాన్ని సాధించడమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని కలెక్టర్ డా.సిరి తెలిపారు. టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో టీబీ బాధితులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు సుమారు 1,200 మంది టీబీ బాధితులకు పోషకాహార కిట్లు అందించినట్లు కలెక్టర్ తెలిపారు.