హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యాన సాగుపై అవగాహన సదస్సు

AKP: గొలుగొండ మండలం పప్పశెట్టిపాలెంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గురువారం జీడిమామిడి, ఆగాకర రైతుల అవగాహన సదస్సు జరిగింది. కేవీకే శాస్త్రవేత్త సత్తిబాబు, ఉద్యాన అధికారి శిరీష శాస్త్రీయ సాగుపై సూచనలు చేశారు. ఆగాకర సాగు పందిళ్లకు రూ.లక్ష, వైర్లకు రూ.24 వేల రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం తోటలను పరిశీలించారు. ఇందులో సీఈవో వెంకటరమణ పాల్గొన్నారు.