హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగ్గయ్య చెరువులో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

KKD: పిఠాపురం 11వ సచివాలయం పరిధిలోని జగ్గయ్య చెరువు ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.టి.వి. రాజేశ్వరరావు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు అందుతున్న మౌలిక వసతులపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.