హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్

NRML: భైంసా గోపాల్ రావు డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ తూమొల్ల దత్తాత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మలను అలంకరించి పాటలు పాడుతూ సందడి చేశారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఛైర్మన్ పేర్కొన్నారు. కౌన్సిలర్ శ్రీనివాస్, అధ్యాపకులు పాల్గొన్నారు.