హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్‌స్టేషన్ నిర్మాణానికి అఖిలపక్ష తీర్మానం

SRPT: చిలుకూరు మండలం జెర్రీపోతులగూడెం గ్రామంలో ఈరోజు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. గ్రామ కార్యదర్శి సంతోష్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ భూమిలో సబ్‌స్టేషన్‌ నిర్మించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరారు.