హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాగజ్‌నగర్‌లో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని విద్యుత్ డివిజన్ కార్యాలయంలో గురువారం వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు ఏడీఈ ఇర్ఫాన్ అహ్మద్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు తమ ఫిర్యాదులను సమర్పించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.