హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీజీ విద్యార్థులకు ఆర్థో శిక్షణ

HYD: గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆడిటోరియంలో ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు IOA ఆర్థోపెడిక్‌ బోధనా సదస్సు నిర్వహించనున్నారు. పీజీ విద్యార్థులకు క్లినికల్‌ పరీక్షలు, శస్త్రచికిత్సా పద్ధతులు, రేడియాలజీ, వార్డు రౌండ్స్‌, రోగుల సంరక్షణపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రిన్సిపల్‌ డా. ఇందిరా, సూపరింటెండెంట్‌ డా. ఉషారాణి పాల్గొననున్నారు.