హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుద్ధ్య సిబ్బందికి దసరా కానుక

SRD: సిర్గాపూర్‌ గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య సిబ్బందికి లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో దసరా కానుకగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. గురువారం సర్పంచ్‌ శ్రీనివాసరావు సిబ్బందికి బట్టలు అందజేశారు. కార్యక్రమంలో రీజియన్‌ చైర్‌పర్సన్‌ రాజ్‌కుమార్‌, జోన్‌ చైర్మన్‌ వెంకట్రావు, క్లబ్‌ అధ్యక్షుడు సాయి సంగమేశ్వర్‌ పాల్గొన్నారు.