హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు

AKP: నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామంలో రూరల్ ఎస్సై రాజారావు చొరవతో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామ భద్రత పటిష్టం చేయడంలో భాగంగా గ్రామ ప్రజల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు స్థానికులు తెలిపారు. గురువారం ఎస్సై రాజారావు చేతుల మీదుగా వాటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.