KDP: టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై సిద్ధవటంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. టీబీ లక్షణాలు, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారి డాక్టర్ మురళీమోహన్ అవగాహన కల్పించారు. వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచన మేరకు ఆరు నెలలు చికిత్స తీసుకోవాలని, పౌష్టికాహారం తీసుకుంటూ మాస్క్ ధరించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఆంధ్రప్రదేశ్
టీబీ నిర్మూలనపై అవగాహన ర్యాలీ


