హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీల డిమాండ్లపై ఎమ్మెల్యేకు వినతి

NTR: నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులు గోపాల్ వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, ఈఎస్ఐ, పీఎఫ్, గ్రాట్యుటీ సౌకర్యాలు కల్పించాలని కోరారు. గ్రామీణ అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు.