హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ సబ్‌‌స్టేషన్‌ను ప్రారంభించిన మంత్రి

ప్రకాశం: కొత్తపట్నంలో రూ.44.25 కోట్ల వ్యయంతో ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో కలిసి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు ప్రారంభించారు.ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ నూతన సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి రావడంతో కొత్తపట్నం, పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా మరింత మెరుగుపడుతుందన్నారు.