WG: సమస్యల పరిష్కారం కోరుతూ పోడూరు మండల గ్రామ రెవెన్యూ సహాయకులు (VRAలు) చేపట్టిన రిలే నిరాహార దీక్ష గురువారం 23వ రోజుకు చేరుకుంది. స్థానిక MRO కార్యాలయం వద్ద ఒంటికాలిపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. పే స్కేలు అమలు చేయాలని, అర్హులైన VRAలకు వెంటనే ప్రమోషన్లు కల్పించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం తమ గోడును ఆలకించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఒంటికాలిపై నిలబడి VRAల నిరసన


