హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతోంది'

WG: వేమవరం ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు విడుదల కావడంపై మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ గురువారం హర్షం వ్యక్తం చేశారు. పాఠశాలలో భోజనాన్ని పరిశీలించి రుచి చూసిన ఆయన.. నాణ్యమైన ఆహారం అందుతోందని తెలిపారు. శ్రమించి నాణ్యమైన భోజనం వండిపెడుతున్న కార్మికులకు ప్రతినెలా సకాలంలోనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.