అన్నమయ్య: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని ఏఐటీయూసీ నియోజకవర్గం అధ్యక్షులు మాదరాజు గంగాధర్, ప్రధాన కార్యదర్శి దాసరి జయచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చిట్వేలిలో ఏపీ హాస్టల్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. హాస్టల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'హాస్టల్ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి'


