హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

W.G: కాళ్ల మండలంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు గురువారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పెదఅమిరంలో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.90 లక్షలతో చేపట్టే రోడ్ల నిర్మాణ పనులకు, ఏలూరుపాడులో రూ.10 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కాళ్లలో బస్‌స్టేషన్, ఏలూరుపాడులో ఆయుర్వేద ఆసుపత్రిని ప్రారంభించారు.