KRNL: తుగ్గలి-రాతన రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. నలుగురు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తుగ్గలి పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రాలయం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి


