హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23 నుంచి సమ్మె..!

ASR: కాఫీ లైజన్ వర్కర్స్‌కు రూ.26వేల వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్‌రావు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 23నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని గురువారం పాడేరులో ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మకు నోటీసు ఇచ్చారు. 156మంది కార్మికులకు ఐడీ కార్డులు, ప్రమాద-జీవిత బీమా, నెలకు 10లీటర్ల పెట్రోల్, ఇతర విధి ఖర్చులు చెల్లించాలన్నారు.