హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మల్లిఖార్జున స్వామి ఆదాయం ఎంతంటే..?

SKLM: టెక్కలి మండలం రావివలసలో ఉన్న ఎండల మల్లిఖార్జునస్వామి హుండీ లెక్కింపు గురువారం జరిగింది. దేవదాయశాఖ అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో హుండీ లెక్కించగా 128 రోజులకు రూ.1,68,910 వచ్చినట్లు ఈవో గురునాథరావు తెలిపారు. అలాగే, టెక్కలిలోని సంతోషిమాత ఆలయం హుండీ లెక్కింపు చేపట్టగా 139 రోజులకు రూ.29,616 వచ్చినట్లు ఆలయ ఈవో మనస్వి వెల్లడించారు.