హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పాత విధానంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలి'

ASR: రేషన్ పంపిణీలో ఎదురవుతున్న టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలని కొయ్యూరు మండల రేషన్ డీలర్లు కోరారు. ఈమేరకు జేసీ శ్రీపూజను కలిసి వినతి అందించారు. క్యూఆర్ కోడ్ విధానం, సిగ్నల్ సమస్యలతో రేషన్ పంపిణీ ఇబ్బందిగా మారిందన్నారు. జిల్లాలో పాత విధానంలోనే రేషన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని జేసీ తెలిపారు.