హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉపాధి పనులను తనిఖీ చేసిన ఏపీవో

KDP: సిద్ధవటం మండలం కడపాయపల్లె సమీప కొండ ప్రాంతంలో ఉపాధి హామీ పనులను గురువారం APO నరసింహులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కందకాల పనుల వద్ద కూలీల హాజరు, నమోదు పరిశీలించారు.మొత్తం 35 మంది కూలీలు హాజరైనట్లు తెలిపారు. వర్షపు నీరు కందకాలలో నిల్వ ఉండటం వల్ల వన్యప్రాణులకు ఉపయోగకరంగా ఉంటుందని, కొండ ప్రాంతాల్లో పచ్చదనం పెరుగుతుందని పేర్కొన్నారు.