హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రికార్డుల భద్రతకు సీసీ కెమెరాలు: MRO

KDP: సిద్ధవటం మండల రెవెన్యూ కార్యాలయంలో రికార్డుల భద్రత కోసం గురువారం నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ విజయ్‌కుమార్ తెలిపారు. డీఎంవై మైక్రో కెమికల్స్ అధినేత బండి జక్కరయ్య రూ.20 వేల విలువైన సీసీ కెమెరాలను ఉచితంగా అందించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జక్కరయ్యను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు.