హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్నాప్‌చాట్‌లో బాలికకు వేధింపులు

KNR: స్నాప్‌చాట్‌లో అమ్మాయిగా పరిచయం చేసుకుని బాలికను వేధించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. కట్టరాంపూర్‌కు చెందిన కొజ్జాలు సంతోష్‌ బాలికతో స్నాప్‌చాట్ ద్వారా పరిచయం పెంచుకుని వేధింపులకు పాల్పడినట్లు ఎల్‌ఎండీ ఇన్‌ఛార్జ్ ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.