ADB: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను ప్రెస్ అకాడమీ రాష్ట్ర ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గురువారం దర్శించుకున్నారు. జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ తరగతుల నిర్వహణలో భాగంగా ఆదిలాబాద్‌కు వచ్చిన ఆయన ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో కొలువైన నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ విశిష్టత, ఆచార సంప్రదాయాల గురించి స్థానిక ఆదివాసీలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
నాగోబాను దర్శించుకున్న ప్రెస్ అకాడమీ రాష్ట్ర ఛైర్మన్


