NLR: భీమవరం SRKR ఇంజినీరింగ్ కాలేజీలో మూడు రోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో నెల్లూరీయులు సత్తాచాటారు. సీనియర్ రికర్వ్ మెన్ విభాగంలో నెల్లూరుకు చెందిన ఆర్.సాయి మౌర్య, పి.రాజేష్ ప్రతిభ చూపారు. విజేతలకు బుధవారం బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ హాజరై బహుమతులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
సత్త చాటిన నెల్లూరు క్రీడా కారులు


