హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓయూలో 10న బతుకమ్మ సంబరాలు: BCSF

HYD: ఈ నెల 10న ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో BCSF ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు. సంబరాలకు సంబంధించిన గోడపత్రికను BCSF రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్‌ ఓయూలో ఆవిష్కరించారు. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని తెలిపారు. ప్రకృతి, స్త్రీశక్తి, కుటుంబ శౌభాగ్యానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.