హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆదోని నూతన ASPగా జయ శర్మ బాధ్యతలు

KRNL: ఆదోని డివిజన్‌ నూతన ASPగా 2024 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిణి జయ శర్మ నియమితులయ్యారు. గ్రేహౌండ్స్‌ అసాల్ట్‌ కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను ఆదోనికి బదిలీ చేశారు. గురువారం బాధ్యతలు స్వీకరించిన జయ శర్మ అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.