ప్రకాశం: త్రిపురాంతకం మండలం గొల్లపల్లి సమీపంలో గురువారం కారు అదుపుతప్పి బోల్తా పడటంతో కృష్ణా జిల్లా ఘంటసాల మాజీ ఎంపీపీ భవానీ దంపతులు గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన తహసిల్దార్ వాసుదేవరావు సిబ్బంది సహాయంతో వారిని కారులో నుంచి బయటకు తీసి తన వాహనంలో త్రిపురాంతకం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం బంధువులకు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
క్షతగాత్రులను కాపాడిన తహసీల్దార్


