కృష్ణా జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ పద్ధతిలో జరిగింది. మచిలీపట్నంలో దరఖాస్తుదారుల సమక్షంలో జేసీ నవీన్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ లావణ్య ప్రక్రియను నిర్వహించారు. మొత్తం 35 షాపులకు టెండర్లు ఆహ్వానించగా, 22 షాపులకు 111 దరఖాస్తులు వచ్చాయి. 4 కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చిన 21 షాపులను లాటరీ ద్వారా కేటాయించి, విజేతలకు లైసెన్సులు మంజూరు చేశారు.
ఆంధ్రప్రదేశ్
లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు


