హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గడువులోగా 'ఇందిరమ్మ' ఇళ్లు పూర్తి చేయాలి'

KNR: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశించారు. తిమ్మాపూర్ ఎల్ఎండీ ప్రజాభవన్‌లో ఎంపీడీవోలు, అధికారులతో ఆయన సమీక్షించారు. నిర్మాణాల ప్రగతిపై ఆరా తీశారు. లబ్ధిదారులకు సకాలంలో నిధులు అందేలా చూడాలన్నారు. పేదలకు ఇళ్లు కల్పించే ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేయాలని సూచించారు.