హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రైతుల ఆధ్వర్యంలో రేపు ధర్నా

KMR: పిట్లం మండలంలో తరచూ విద్యుత్ కోతలను నిరసిస్తూ రేపు అంబేద్కర్ చౌరస్తాలో రైతుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. పంటలకు సాగునీరు అందించాల్సిన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.