హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో సౌర విద్యుత్ ప్రయోజనాలపై అవగాహన

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని విద్యుత్ సెక్షన్ కార్యాలయంలో మంగళవారం సేవా సేతు అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. డీఈఈ బి.వై. శేషగిరిరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వినియోగదారులకు సౌర విద్యుత్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. గిద్దలూరు సబ్ డివిజన్ పరిధిలోని ఏఈలు ఎన్. నారాయణరెడ్డి, కె. వెంకటేశ్వరరావు, ఎం. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.