హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాశినాయనలో గుప్తనిధుల ముఠా అరెస్ట్

KDP: కాశినాయన మండలం జ్యోతి అటవీ బీట్‌లో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను అటవీ అధికారులు పట్టుకున్నారు. ఏపీ, తెలంగాణకు చెందిన వారు టాటా ఏస్ వాహనంలో పూజా సామగ్రి, పలుగులు, పారలతో అడవిలోకి వెళ్లగా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.