హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో 13 మద్యం దుకాణాలకు లాటరీ

అన్నమయ్య జిల్లాలో 2026–27 సంవత్సరానికి 13 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా లైసెన్సుదారులను ఎంపిక చేశారు. జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆధ్వర్యంలో గురువారం మదనపల్లె కలెక్టరేట్‌లో లాటరీ నిర్వహించారు. 78 దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.2.34 కోట్ల ఆదాయం సమకూరింది. దరఖాస్తులు రాని మరో 4 దుకాణాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.