హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ

KMM: సైబర్ సెక్యూరిటీ అవగాహన పోస్టర్లను సీపీ సునీల్ దత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్క క్షణం ఆలోచిస్తే సైబర్ నేరాలకు చెక్ పెట్టవచ్చన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. గుర్తుతెలియని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులను నమ్మవద్దని సూచించారు. ముఖ్యంగా ఓటీపీ, పిన్, బ్యాంక్ ఖాతా వివరాలు ఎవరికీ చెప్పవద్దని సీపీ స్పష్టం చేశారు.